బీహార్‌లోని ఓ జువెల్లరీ షాపులో భారీ చోరీ జరిగింది. పట్టపగలే షాపులోకి చొరబడిన ఆరుగురు దుండగులు గన్స్ చూపించి సుమారు రూ.25 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. అయితే నగలను ఎత్తుకెళ్తున్న సమయంలో పోలీసులు కాల్పులు జరపగా ఇద్దరికి బుల్లెట్లు తగలగా మిగిలిన నలుగురు నగలతో పరారయ్యారు. చోరీ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.