మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోయిసర్లోని తారాపూర్ ఎంఐడీసీ ప్రాంతంలోని రెస్పాన్సివ్ ప్రైవేట్ లిమిటెడ్ గోదాములో గురువారం అకస్మాత్తుగా మంటలు భారీగా చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.