వరంగల్ కోట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 500 గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కొట్టంలో గొర్రెలు ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే 500 గొర్రెలు మృతి చెందాయన్నారు. దీంతో గొర్రెల యజమాని దుగ్గిరాల లక్ష్మణ్ వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.