రజకుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తామని చైర్మన్ పెంట రాజయ్య అన్నారు. ఆదివారం పాత మంచిర్యాల రాళ్లవాగు సమీపంలోని మడేల్అయ్యా (మల్లికార్జున స్వామి) దేవాలయంలో రజకుల బోనాల జాతర జరిగింది. ఈ జాతరకు హాజరైన మున్సిపల్ చైర్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే దివాకర్ రావు సహకారంతో రజకుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రజక కుల సంఘం నాయకులు నిమ్మరాజుల కుమార్, సత్యనారాయణ, అంబ్రోస్, కటుకూరి శంకర్, రావుల తిరుపతి, నారాయణ, రాజలింగు అశోక్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.