సింగరేణిలో నూతన బొగ్గు గనుల తీసుకొచ్చి ఇతర పారిశ్రామిక రంగాల్లో కంపెనీ విస్తరణకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్ తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఓసీలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉండి వాగ్దానాలను విస్మరించిన ప్రధాని మోడీతో అంటకాగిన బీఆర్ఎస్ నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తూ కార్మికులను మోసం చేయాలని చూస్తున్నారన్నారు.