అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సభావాత్ మోతిలాల్, డీసీపీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తో పాటు రెవెన్యూ, గనుల శాఖ అధికారులతో కలిసి ఇసుక అక్రమ రవాణాపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఇసుక అక్రమంగా తరలించడాన్ని నియంత్రించేందుకు పోలీస్, రెవెన్యూ, చర్యలు తీసుకోవాలన్నారు.