శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే 1ఏ గనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంగళవారం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ యాజమాన్యానికి ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల సంక్షేమంపై లేదన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించక పోతే ఆందోళన చేపడతామని తెలిపారు.