మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన 60 ట్రాక్టర్ల ఇసుక డంప్ లను రెవెన్యూ, మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. ఆర్ ఐ అజీజ్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్లను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు మంగళవారం తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.