మంచిర్యాల సాయికుంటలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం తెలిపారు. పాఠశాలలోని 12 మంది 10వ తరగతి విద్యార్థులు అస్వస్థతకు గురవగా, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్య నిపుణుల సమక్షంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు త్రాగునీరు, ఆహారం నమూనాలను సేకరించారన్నారు.