డీఎస్సీ-2024 స్కూల్ -అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 29, 30న పరిశీలించనున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. 1: 3 పరిశీలనకు సమాచారం అందిన వారు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల్లోపు ధ్రువీకరణ పత్రాలతో డీఈవో కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు. రెండు జతల జిరాక్స్ కాపీలు గెజిటెడ్ ఆదిలాబాద్ అధికారి సంతకంతో పాటు రెండు ఫొటోలు తీసుకురావాలని సూచించారు.