మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలికల వసతి గృహంలో ఆహారం వికటించడంతో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు శుక్రవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహాన్ని సందర్శించి ఆహార సామాగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.