మంచిర్యాలలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బుధవారం తెలిపారు. ఉదయం కిచిడి తిని ఒక్కరు మాత్రమే స్వల్ప అస్వస్థతకు గురవగా, ముందస్తు జాగ్రత్తగా మరో 11 మందిని ఆస్పత్రికి తరలించామన్నారు. విద్యార్థుల అనారోగ్యాన్ని రాజకీయాలకు వాడుకోవడం దారుణమని, మాజీ మంత్రి హరీష్ రావు ఏ ఆశ్రమ పాఠశాలకైనా వచ్చి ఫుడ్ మెనూ పరిశీలించాలని సవాల్ విసిరారు.