మంచిర్యాల స్ధానిక గోపాల్ వాడకు చెందిన పీఈటీ గడిగొప్పుల సదానందం 14న గుండె పోటుతో మరణించగా సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్ర దానం చేశారు. గురువారం వారి ఇంటి వద్ద జరిగిన సంస్మరణ సభలో ఫౌండేషన్ ప్రతినిధులు నూతి సురేష్ కుమార్, కోరల్ల రాంరెడ్డి, బోరె అవినాష్ లు నేత్ర, అవయవ, శరీర దానాల మీద అవగాహన కల్పించారు. తర్వాత కుటుంబ సభ్యులను అభినందన పత్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్యల శ్రీపతి, చంద్రమౌళి, నేత్రదాత కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.న్నారు.