కట్ట పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే

1467பார்த்தது
మంచిర్యాల పట్టణం హమాలివాడ (సినిమా వాడ) కట్ట పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కుటుంబ సభ్యులు ఆదివారం ప్రత్యేక పూజ నిర్వహించి తమ మొక్కులను చెల్లించారు. ఎమ్మెల్యే తో పాటు ఆయన సతీమణి రాజకుమారి, కుమారుడు విజిత్ రావు పాల్గొని పోచమ్మ తల్లితో పాటు పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఆషాడ మాసం చివరి ఆదివారం సందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పోచమ్మ తల్లి ఆలయ పున: నిర్మాణం చేపట్టి అభివృద్ధికి కృషి చేసిన నల్ల శంకర్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మామిడి శెట్టి వసుంధర రమేష్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల శంకర్, గౌరవాధ్యక్షులు గొంగళ్ళ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி