జైపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో బుధవారం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి గణపతి ప్రతీ 150 గృహాలకు ఒక ఎన్యుమరేటర్ ను నియమించి సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.