తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ కార్నర్ వద్ద మంగళవారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందం మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.