మంచిర్యాల జిల్లాలో 100% అక్షరాస్యత సాధనకు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 100% అక్షరాస్యత సాధనకు న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమం ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్ష మంది నిరక్షరాస్యులు ఉన్నారని, మొదటి విడతగా 20, 425 మందిని నిరక్షరాశులుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.