యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని ఎస్ఐ రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి మందమర్రి మండలంలోని అందుగులపేట గ్రామంలో పోలీసు కళాజాత ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, సైబర్ క్రైం, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ యువత గంజాయి, మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని వాటికి బానిసాలు కావద్దని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. సైబర్ క్రైం మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.