టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సమన్వయంతో ముందుకు సాగుతామని పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మందమర్రి పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పటిష్ఠానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.