రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

60பார்த்தது
రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
తాండూర్ మండలంలోని కత్తెర్ల నుండి బర్లగూడెం వరకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో బోయపల్లి మాజీ సర్పంచి భీమా సునీత, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ కుమార్ వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని చెప్పినట్లు వారు తెలిపారు.