కన్నేపల్లి మండలం నాయకునిపేట పంచాయతీ బొగుడ గూడానికి చెందిన మతిస్థిమితం లేని బోర్ల ధర్మయ్య (51) పీపీ రావు ప్రాజెక్టులో పడి మృతి చెందినట్లు ఎస్సై గంగారం తెలిపారు. గత అక్టోబర్ 12న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం ప్రాజెక్ట్ కట్టపై కాపరులకు దుస్తులు, చెప్పులు కనిపించాయి. దీంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. కుమారుడు సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.