మైసమ్మ తల్లి ఆశీస్సులతో రక్షణతో కూడిన బొగ్గు సాధించాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని మైసమ్మ తల్లి ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ శాంతిఖని గని కార్మికులు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.