ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మోతీ బజార్‌లోని ఓ టపాసుల దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దుకాణంలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.