కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘మహిళా సమ్మాన్ సేవింగ్’ స్కీంతో మహిళలు ఆర్థిక వృద్ధికి బాటలు వేసుకోవచ్చు. ఈ పథకంలో కనీసం రూ.వెయ్యి, గరిష్టంగా రూ.2 లక్షల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది సింగల్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్. దీని కాలపరిమితి రెండేళ్లు కాగా ప్రస్తుతం 7.50% వడ్డీ ఇస్తున్నారు. మహిళలు తమ పేరు మీద లేకపోతే కుమార్తె పేరుపై స్కీంలో చేరవచ్చు.