మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి హాజరవ్వనున్నారు. ఈ మేరకు గురువారం యావత్మాల్ జిల్లా దీగ్రాస్ నియోజకవర్గం నేర్ పట్టణ కేంద్రంలో మాణిక్ రావు ఠాక్రే, ఎంపి సంజయ్ దేశ్ముక్, పవన్ జెశ్వాల్ తో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.