వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం బాలకృష్ణపురంలో వెలసిన అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, హోమాలు, పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో గ్రామస్థుల సహకారంతో విరాళాలు సేకరించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేశారు. గ్రామంలో ఆడపడుచులు బంధుమిత్రులు రాకతో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ భక్తులకు అన్నదానం చేశారు.