వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి పీఏసీలలో ధాన్యం కొనుగోళ్ళ అంశంపై సమీక్షించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి వేగంగా నగదు చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వనపర్తి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ఫ్యాన్లు, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.