ఇంటింటి కుటుంబ సర్వేను సమగ్రంగా నిర్వహించి, ఎలాంటి తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బండారునగర్ లో ఎన్యూమారేటర్లు నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. కావలసిన సమాచారాన్ని ప్రజలు సర్వే సిబ్బందికి తెలిపి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తప్పులు లేకుండా వివరాలను జాగ్రత్తగా నమోదుచేయాలని సిబ్బందికి సూచించారు.