నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ గ్రామ కొండపై వెలసిన తిమ్మప్ప (వేంకటేశ్వర స్వామి) ఆలయ ఆవరణలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ శివకుమార్ రెడ్డి, ఆలయ పూజారి, గ్రామ పెద్దలు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను శివకుమార్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్ళారు. ఆలయం అభివృద్ధికి అధికారులతో మాట్లాడుతానని చెప్పారు.