పత్తి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: కలెక్టర్

56பார்த்தது
పత్తి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: కలెక్టర్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్ లో సీసీఐ, వ్యవసాయ, ట్రాన్స్పోర్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 7 కాటన్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6 మిల్లులో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయని చెప్పారు. సంబంధిత అధికారులు ప్రతి రోజు కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు.

தொடர்புடைய செய்தி