ఉపాధి హామీ పనులలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు మేరకు మరికల్ మండలం కన్మనూరు ఫీల్డ్ అసిస్టెంట్ మతిన్, మాజీ ఇన్ ఛార్జ్ ఏపీవో చంద్రశేఖర్ లను విధుల నుండి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డిఆర్డిఓ మోగులప్ప శుక్రవారం తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు మక్తల్ ఎంపీడీవో తనిఖీ నిర్వహించారు. ఆయన అందించిన నివేదిక ఆధారంగా వారిద్దరిని విధుల నుండి తాత్కాలికంగా తొలగించినట్లు తెలిపారు.