కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి బుధవారం అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల దుర్మార్గంగా వ్యవరిస్తోందని మండిపడ్డారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు భూముల ఇవ్వడం ఇష్టం లేదని గత అయిదు నెలలుగా రైతులు చెబుతున్న ప్రభుత్వం మొండిగా వ్యవరిస్తుందని విమర్శించారు.