ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ట్రైని కలెక్టర్ గరీమా నరుల అధికారులకు సూచించారు. నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 25 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ట్రైని కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.