రాష్ట్ర ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డిలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చేపట్టిన బహిరంగ సభకు నారాయణపేట జిల్లా నుండి సంఘం నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్ళారు. రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబ మాట్లాడుతూ. రాష్ట్రంలో పంటల భీమా పథకం అమలు చేయాలని, షరతులు లేకుండా రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రైతు బంధు ఇవ్వాలని కోరారు.