విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలని షీ టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. శుక్రవారం ధన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్ పై అవగాహన కల్పించారు. ఆకతాయిలు వేధిస్తే షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలని చెప్పారు. మత్తు పదార్ధాలతో జరిగే నష్టాలను వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని చెప్పారు.