నారాయణపేట పట్టణంలోని అంజనా ఫంక్షన్ హాలులో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం గృహ జ్యోతి, మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు.