నాగర్ కర్నూల్: విద్యుదాఘాతంతో భాగ్యమ్మ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా, మునిసిపాలిటీలోని దేశీ ఇటిక్యాల గ్రామంలో భాగ్యమ్మ(35) అనే మహిళ శనివారం ఉదయం వాకిలి ఊడుస్తున్న క్రమంలో కరెంట్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినది. కొన్ని రోజులుగా కరెంట్ వైర్ కింద పడిందని అధికారులకు తెలిపిన వారు పట్టించుకోలేదు అని, దాని వలనే భాగ్యమ్మ మృతి చెందినది అని కుటుంబ సభ్యులు తెలిపారు.