సమాజంలో ప్రతి ఒక్కరు సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. పెద్దకొత్తపల్లి మండల కేంద్రం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శనివారం పాల్గొని మాట్లాడుతూ సేవ చేయడం కోసం ప్రతి ఒక్కరు సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు.