బల్మూర్ మండలంలోని మైలారం గుట్ట వద్ద తవ్వుతున్న మైనింగ్ ను వెంటనే నిలిపివేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ బల్మూర్, లింగాల మండల మహాసభలు నిర్వహించారు. మైలారం గుట్టలో మైనింగ్ పేరుతో బలవంతంగా పోలీసుల ప్రోద్బరంతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.