తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, రాజకీయ, విద్య, కుల సర్వే దరఖాస్తులు ఎలా నింపాలో వాటి గురించి కోడెర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ సింగ్, తహసిల్దార్ విజయకుమార్, ఎంపీడీవో శ్రవణ్ కుమార్ లు మండలం నుండి వచ్చిన ఆయా గ్రామపంచాయతీ కార్యదర్సులు, ఈజీఎస్ టిఏలు, అంగన్వాడీ టీచర్లలకు సర్వేపై అవగాహన నిర్వహించారు.