అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం డీసీసీ జనరల్ సెక్రటరీ జిల్లెల్ల జగత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భర్తయాదిరెడ్డి, కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.