మక్తల్ పట్టణంలో జరుగుతున్న నిజాముద్దీన్ అవులియా దర్గాలో ఉర్సు సందర్భంగా మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలో చాదర్ సమర్పించారు. దర్గా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాముద్దీన్ బాబా ప్రజలను సుఖసంతోషాలతో ఉంచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు.