జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిదిలో ఎంపిక చేసిన గ్రామాల్లో బుధవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజలకు పౌరహక్కులపై అవగాహన కల్పించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం చూపరాదని అన్నారు. పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఫోక్సో చట్టాల గురించి వివరించారు. ఆపదలో వుంటే డయల్ 100 నంబర్ కు ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.