ఎర్రవల్లిలో రోడ్డెక్కిన పోలీసుల భార్యలు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎర్రవల్లిలోని 10వ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు గురువారం సాయంత్రం రోడ్డెక్కారు. బెటాలియన్ లో వెట్టిచాకిరిని నిర్మూలించి, పోలీస్ సిబ్బంది హక్కులను కాపాడాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం ఉండాలని డిమాండ్ చేశారు. నెలలో 26రోజులు డ్యూటీ వేయడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. హైవేపై ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు.