అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా :మహబూబ్ నగర్ ఎంపి
మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని ఆదివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద ఎంపీ అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన గెలుపు కోసం కృషి చేసిన పాలమూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.