పాలమూరు నుంచే ప్రారంభమైన కేసీఆర్ ప్రస్థానం ఇక్కడి నుంచే పతనం ప్రారంభమైందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లాపై కల్వకుంట్ల కుటుంబం విషం చిమ్ముతుందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా వారు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో ఇప్పుడే అభివృద్ధి మొదలైందని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మట్టిలో కొట్టుకుపోతారని విమర్శించారు.