కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఫార్మా బాధితులను సోమవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పరామర్శించడానికి ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి బయలుదేరారు. ఈ సందర్భంగా వారిని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎంపీ డీకే అరుణ తో పాటు పలువురు బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.