ముద్ర లోన్లను పేద బడుగు బలహీన వర్గాలకు పూర్తిస్థాయిలో ఎందుకు ఇవ్వడం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ముద్ర లోన్లు పూర్తిస్థాయిలో పక్కదోవ పడుతున్నాయన్నారు. లోన్ల విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.