ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మండల వారీగా ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు ఎక్కడ పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించాలన్నారు.