రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కౌకుంట్ల ఎంఈఓ మంజులత కలెక్టర్ అన్నారు. కౌకుంట్ల మండల కేంద్రంలో శనివారం ఎన్యుమరేటర్లు చేపట్టిన సర్వేను దగ్గరుండి పర్యవేక్షించారు. సర్వే చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. సర్వే ఫారంలో వున్న ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించి. వారు అందించే వివరాలను నమోదు చేయాలని సూచించారు. పొరపాట్లు జరగకుండా చూడాలని అన్నారు.